ఇబ్రహీంపట్నం, జనవరి 5: ఇబ్రహీంప ట్నం మార్కెట్ కమిటీ చైర్మన్‌గా చంద్రయ్య నియమితులయ్యారు. గత నాలుగేండ్లుగా ఈ పదవి ఖాళీగా ఉండగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి జోక్యం మేరకు ప్రభుత్వం భర్తీచేసింది. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎస్సీలకు రిజర్వు కావడంతో మంచాల మండలంలోని చిత్తాపూర్ గ్రామానికి చెం దిన ఏర్పుల చంద్రయ్యను చైర్మన్‌గా ప్రభు త్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిం ది. ఉపాధ్యక్షుడిగా కొంగరకలాన్ గ్రామానికి చెందిన రవీందర్‌రెడ్డిని ప్రకటించగా.. డైరెక్టర్లుగా మంగల్పల్లిపటేల్గూడ గ్రామానికి చెందిన పాశం రవీందర్‌గౌడ్, ఎలిమినేడు గ్రామానికి చెందిన బుట్టి రాములు, మంచాల గ్రామానికి చెందిన పావని, తక్కళ్లపల్లిగ్రామానికి చెందిన తలారి మల్లేశ్, ఇబ్రహీంపట్నానికి చెందిన నేనావత్ శంకర్‌నాయక్, లోయపల్లి గ్రామానికి చెందిన నారి యాదయ్య, ఆరుట్ల గ్రామానికి చెంది న జానీపాషా, దండుమైలారం గ్రామానికి చెందిన మంగావెంకటేశ్, నక్కర్త మేడిపల్లి గ్రామానికి చెందిన గణేశ్, చింతపట్ల గ్రా మానికి చెందిన వెంకట్‌రెడ్డి నియమితులయ్యారు. వర్తక సంఘం నుంచి కిరణ్‌కుమార్, శ్రీనివాస్ డైరెక్టర్లు అయ్యారు. రాచకొండ సహకారసంఘం చైర్మన్ వెంకట్రె డ్డి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్, మార్కెటింగ్‌శాఖ అసిస్టెంట్ డైరెక్టర్తోపా టు జిల్లా మార్కెటింగ్ అధికారి సభ్యులుగా ఉండనున్నారు.
మంచాల మండలంలోని చిత్తాపూర్ గ్రా మానికి చెందిన ఏర్పుల చంద్రయ్య మొ దటి నుంచి ఎమ్మెల్యే కిషన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు. గతంలో టీడీపీ మంచాల మండలాధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర పోటీ నెలకొన్నది. దీంతో పదవిని భర్తీ చేయడం లో తీవ్ర జాప్యం జరిగింది. ఎట్టకేలకు ఎమ్మెల్యే మంచిరెడ్డి జోక్యంతో చైర్మన్‌గా ఏర్పుల చంద్రయ్య నియమితులయ్యారు. అలాగే వైస్ చైర్మన్‌గా ఎంపికైన రవీందర్‌రెడ్డి కూడా ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడే. పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా వైస్ చైర్మన్ పదవి అతడ్ని వరించింది. మంచాల, యాచారం మండలాలకు చెందిన ఎక్కువ మందికి మార్కె ట్ కమిటీలో డైరెక్టర్లుగా అవకాశం లభించింది.
చైర్మన్‌గా ఎన్నికైన ఏర్పుల చంద్రయ్య మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం మార్కెట్కమిటీని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మార్కెట్‌కమిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఆయన నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తా. ఎమ్మెల్యేతో చర్చిం చి త్వరలోనే ప్రమాణస్వీకారం చేస్తామన్నారు.