ధారూరు : ధారూరు మండల పరిధిలోని చింతకుంట, మైలారం గ్రామాల్లో కేంద్రబృందం స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణలో భాగంగా పారిశుధ్యంపై ప్రతి ఇంటిని పరిశీలించారు. బుధవారం మండల పరిధిలోని చింతకుంట , మైలారం గ్రామాల్లో కేంద్ర బృందం రెండు టీమ్‌లుగా ఏర్పడి మొదటి టీమ్ చింతకుంట గ్రామంలో కేంద్ర బృందం సభ్యుడు శివకుమార్, రెండో టీమ్ మైలారం గ్రామంలో కేంద్ర బృందం సభ్యుడు రఘు రెండు టీమ్‌లకు చందు లీడర్ వీరు మండలంలోని రెండు గ్రామాల్లో పరిశీలించారు. గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ప్రతి ఇంట్లో మరుగు దొడ్డి, ఇంకుడు గుంత, కిచన్గార్డన్(పేరట్లో మొక్కలు) ఉన్నాయ అని పరిశీలించారు. ఇంట్లో వారిని మీరు మరుగు దొడ్డిని వినియోగించుకుంటున్నారా, మీ వద్ద ఇంకుడు గుంత ఉందా, పేరట్లో మొక్కలు పెంచుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు.
పారుశుధ్యంలో భాగంగా ప్రతి ఇంటి పరిసరాలను ప్రతి ఇంట్లో మరుగు దొడ్ల వాడకాన్ని, తడి పోడి చెత్త విధానాన్ని వారు పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్డీవో కృష్ణన్, డీఎల్పీవో అనిత, ఎంపీడీవో ఉమాదేవి, ఎంపీవో షఫీఉల్లా, డిప్యూటీ తాసిల్దార్ వెంకటయ్య, ఏపీవో సురేశ్, గ్రామాల సర్పంచులు బాబ్యనాయక్, లక్ష్మమ్మ ప్రభాకర్‌రెడ్డి, ఉప సర్పంచ్ వెంకటయ్య, టీఏలు శ్రీనివాస్, వెంకట్దాసు, పంచాయతీకార్యదర్శులు సూరిబాబు, మమత, రాజ్‌కుమార్‌లు, మహిళ సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.