రంగారెడ్డి, మే 23 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను ముచ్చటగా మూడోసారి పెంచి వాహనదారులకు వాత పెట్టింది. ఇప్పటికే పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులతో ఇంధన కొరత వెంటాడుతున్నది. గత పది రోజుల్లో మూడోసారి పెరిగిన ధరలతో జిల్లాలో పెట్రోల్ లీటర్‌కు 90 పైస లు పెరిగి రూ.113కు.. డీజిల్ 90 పైసలు హైక్ అయి రూ.101కు చేరింది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వాహనదారులతోపాటు సామాన్యులపై తీవ్ర ప్రభా వం చూపే అవకాశమున్నది. నిత్యావసరాలు పెరిగే ప్రమాదం ఉన్నది. ఇం ధన ధరల పెంపుపై వాహన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టానుసారంగా పెంచడం సరికాదని పేర్కొంటున్నారు.
తరచూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావంతో ఇప్పటికే ఎక్కువమంది ఎలక్ట్రిక్, సీఎన్జీ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు రవాణా రంగంతోపాటు పరిశ్రమలపైనా ప్రభావం చూపనున్నది. జిల్లాలో 3500లకుపైగా చిన్న, మధ్యతరహా, భారీ తరహా పరిశ్రమలున్నాయి. వాటినుంచి తయారయ్యే ముడి సరుకును ఎగుమతి, దిగుమతి చేసేందుకు తరలించే వాహనాలపై కూడా పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం పడుతున్నది. జిల్లాలో సుమారు 440 వరకు పెట్రోల్ బంక్‌లున్నాయి. వాటి నుంచి ప్ర తిరోజూ ఆరు లక్షల లీటర్ల డీజిల్, మూడు లక్షల లీటర్ల పెట్రోల్‌ను విక్రయిస్తున్నారు.