చుంచుపల్లి, ఆగస్టు 18 : చుంచుపల్లి మండల పరిధిలోని రాంపురం ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు, నోట్ పుస్తకాలను కొల్లి ఫౌండేషన్ చైర్మన్ కల్పనా చౌదరి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా పాఠశాల ఉపాధ్యాయుడు బాలు మాట్లాడుతూ.. కొల్లి ఫౌండేషన్ తరపున కల్పనా చౌదరి చేసిన ఈ ఉదార సహాయాన్ని అభినందించారు. కల్పనా చౌదరి మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలనే లక్ష్యంతో, వారికి తమ వంతు సహాయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా కొల్లి ఫౌండేషన్ తరఫున మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కో-ఆర్డినేటర్ రూప్లా నాయక్, ఉపేందర్, ప్రతినిధులు, స్థానిక సర్పంచ్ బాదావత్ అనిత, ఉప సర్పంచ్ పులిచర్ల వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు విశ్వనాధం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.