మొయినాబాద్, ఏప్రిల్24 : ఓ ఫామ్ హౌస్‌లో భారీగా మద్యం బాటిల్స్ లభించడంతో ఫామ్ హౌస్ నిర్వాహకునిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ డీకే లక్ష్మిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని అజీజ్‌నగర్‌లో గల ఆరెంజ్ రిట్రేట్ ఫామ్ హౌస్‌లో శనివారం రాత్రి ఓ పార్టీ నిర్వహించారు. ఆ ఫామ్‌హౌస్‌లో పార్టీ నిర్వహిస్తున్న వారు ఎలాంటి అనుమతులు లేకుండా భారీగా మధ్యం తీసుకొచ్చారని సమాచారం అందించడంతో పోలీసులు ఫామ్ హౌస్‌పై దాడి చేశారు.
ఫామ్ హౌస్‌లో తనిఖీలు నిర్వహించగా భారీగా మధ్యం సీసాలు లభించాయి. మద్యానికి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో ఫామ్ హౌస్ నిర్వాహకుడు, పార్టీ నిర్వాహకుల మీద కేసు నమోదు చేశామని సీఐ లక్ష్మిరెడ్డి తెలిపారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.