తాండూరు, మే 8 : మున్సిపల్ ఎన్నికల సమయంలో తాండూరులోని సెయింట్ మార్క్స్ హైస్కూల్లో ఓట్ల లెక్కింపు సందర్భంగా జరిగిన ఘర్షణకు సంబంధించి బీఆర్ఎస్ తాండూరు నియోజకవర్గ ఇన్చార్జి పంజుగుల శ్రీశైల్‌రెడ్డి ఫిర్యాదుతో తాండూ రు మున్సిఫ్ కోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తోపాటు ఆయన నలుగురు అనుచరులపై తాండూరు పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలు విస్మరించి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, తన అనుచరులతో కలిసి అక్రమంగా కౌం టింగ్ కేంద్రంలోకెళ్లి ఫలితాలను తారుమరు చేసేందుకు యత్నించారని శ్రీశైల్‌రెడ్డి పేర్కొన్నారు.
బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసుల నమోదుపై ఎన్నికల కమిషన్‌కు, కలెక్టర్‌కు, జిల్లా ఎస్పీకి, తాండూరు ఆర్డీవోకు ఫిర్యాదు చేసినా పోలీసులు మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఆయన అనుచరులపై కేసులు నమోదు చేసి.. అరాచకానికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులను వదిలేశారని ఆరోపించారు. ఈ విషయమై తాం డూరు మున్సిఫ్ కోర్టులో కాంగ్రెస్ నాయకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతోపాటు వారిని విచారించాలని తాను పిటిషన్ వేయ గా.. ఏప్రిల్ 10 లోపు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని న్యాయస్థానం తాం డూరు పోలీసులను ఆదేశించిందన్నారు.
మే 2న తాండూరు ఠాణాలో మరోసారి తాను ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డితోపాటు ఆయన నలుగురు అనుచరులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధారాసింగ్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కరణం పురుషోత్తం, తాండూరు మండలం ఎలిమకన్య పీఏసీఎస్ చైర్మన్ రవిగౌడ్, తాం డూరు పట్టణ కాంగ్రెస్ నాయకుడు జుబేర్ లాలపై కేసు నమోదు చేశారని తెలిపారు. పోలీసులు విధి నిర్వహణలో నిష్పక్షపాతం గా వ్యవహరించాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన కేసులో తాం డూరు ఎమ్మె ల్యేపై పోలీసులు న్యాయబద్ధంగా విచారించాలని..లేకుంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు.