ఆదిబట్ల, మే 20 : అవుటర్ రింగు రొడ్డు పై కారు అదుపు తప్పి ఇనుప బారీకేడ్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. ఆదిబట్ల సీఐ రాఘవేందర్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శిల్పా నగర్ కాలనీ, నాగారానికి చెందిన కితాబ్ ఆలీ (35) పనుల కోసం లేబర్‌ను సప్లై చేసేవాడు. ప్రతి రోజు తాను తుక్కుగూడ, నాగారం, కీసరతో పాటు పలు ప్రాంతాలకు లేబర్‌ను సప్లై చేసేవాడు.
దీంతో తాను తుక్కుగూడ నుండి కీసర వైపు తన ఇంటికి కారులో అవుటర్ రింగు రోడ్డు పై వెళుతుండగా బొంగుళూరు ఎగ్జిట్ 12 వద్ద కు రాగనే తాను డ్రైవ్ చేస్తున్న కారు అవుటర్ రింగు రోడ్డు పై ఉన్న ఇనుప బారీ కేడ్లను ఢీకొట్టాడు. దీంతో తన కారు మధ్యలో నుండి ఇనుప బారీ కేడ్లు చొచ్చుకు పోవడంతో కారు నడుపుతున్న కితాబ్ ఆలీ కారులో ఇరుక్కు పోయి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.