వికారాబాద్ : ఏకేఆర్ స్టడీ సర్కిల్ 2022 నూతన సంవత్సర క్యాలెండర్ను బుధవారం హైదరాబాద్లో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్పటేల్లు ఆవిష్కరించారు. స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులతో మంత్రి కేటీఆర్ మాట్లాడి ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. వీరితో పాటు గ్రాడ్యూయేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కాటం శ్రీధర్, స్టడీ సర్కిల్ డైరెక్టర్ బీవీ రమణ, స్టడీ సర్కిల్ అభ్యర్థులు పాల్గొన్నారు.