ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 1: అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని సీపీఎం మండల కార్యదర్శి బుగ్గ రాములు అన్నారు. సోమవారం ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేత్తనం ఇవ్వాలని చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించనున్న సందర్భంగా సోమవారం ఉదయం ఆశావర్కర్లు వెళ్లకుండా పోలీసులు వారిని ముందస్తు అరెస్టులు చేయటం సిగ్గుచేన్నారు.
ఎన్ని అరెస్టులు చేసినా ఉద్యమాలను ఆపేది లేదని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఊరుకునేది లేదని హెచ్చరించారు. అరెస్టు అయిన వారిలో అంగన్వాడీ టీచర్ బాలమణి, ఆశావర్కర్లు బాగ్యలక్ష్మి, విజయ, ఫరీద తదితరులున్నారు.