మొయినాబాద్ : కొడంగల్ నియోజకవర్గం లోని కోస్గిలో జరిగిన రైతుదీక్షకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఘన స్వాగతం లభించింది. సోమవారం మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్‌నగర్ చౌరస్తాకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరావడంతో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి గులా బీమయంగా మారింది. కేటీఆర్ హిమాయత్‌నగర్ చౌరస్తాకు చేరుకోవడంతో చౌరస్తాలో జై తెలంగాణ..జై కేసీఆర్..జై కేటీఆర్..సబితమ్మ నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదాలు మార్మో గాయి.
మొయినాబాద్ బీఆర్ఎస్ నేతలు, నా యకులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం చౌరస్తాలో పార్టీ జెండాను మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌లతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. భారీగా తరలొచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులకు అభివాదం చేసి ధన్యవాదాలు తెలిపారు.
అలాగే, చేవెళ్ల మండల కేంద్రంలోనూ మాజీ మంత్రికి బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన షాబా ద్ చౌరస్తాలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి, బీఆర్ఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు స్వప్న, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, మండలాల అధ్యక్షులు వెంకట్‌రెడ్డి, ప్రభాకర్, రైతు సమన్వయ సమితి మండల మాజీ కన్వీనర్ శ్రీహరియాదవ్, చేవెళ్ల మాజీ ఎంపీపీ బాల్‌రాజ్, సీనియర్ నాయకులు గునుగుర్తి జయవంత్, రవియాదవ్, నర్సింహగౌడ్, సుధాకర్యాద వ్, హిమాయత్‌నగర్ మాజీ సర్పంచ్ మం జులారవియాదవ్, మాజీ ఉపసర్పంచ్ షాబా ద్ శ్యాం, పీఏసీఎస్ మాజీ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ రవూఫ్, నాయకులు రాము, రితీశ్‌రెడ్డి, మల్లారెడ్డి, రాజు, సురేందర్‌గౌడ్, ప్రవీణ్‌రెడ్డి, పరమేశ్, ప్రవీణ్, రవీందర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, జంగయ్య, మహేందర్, రాఘవేందర్‌యాదవ్, అంజిరెడ్డి, తిరుపతిరెడ్డి, చెన్నయ్యయాదవ్, రాజుగౌడ్, దర్శన్, డేవిడ్, మిట్టు, అరవింద్, రాంప్రసాద్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.