బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే హ్యాట్రిక్ విజయానికి పునాదుల్లా పనిచేయనున్నాయని, ప్రజలంతా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
- ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారు
- బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి
- ముమ్మరంగా గులాబీ శ్రేణుల ప్రచారం
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 26 : రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే హ్యాట్రిక్ విజయానికి పునాదుల్లా పనిచేయనున్నాయని, ప్రజలంతా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని పలు కాలనీల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి పాలనలో అభివృద్ధికి ఆమడ రంలో ఉన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని నేడు సీఎం కేసీఆర్ దీవెనలతో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దారన్నారు. మరింత అభివృద్ధి కోసం బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల సహకారంతో ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని ధనిక నియోజకవర్గాల్లో ఒకటిగా నిలిపారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకు యాదగిరి, బీఆర్ఎస్ నాయకులు మంద సుధాకర్, యాచారం రవీందర్, బర్తాకి జగన్, ప్రవీణ్, టిల్లు పాల్గొన్నారు.
యువత కీలకంగా పని చేయాలి

ఆదిబట్ల : ఎన్నికలు నేపథ్యంలో భాగంగా పార్టీ విజయానికి బీఆర్ఎస్ యువజన, విద్యార్థి శ్రేణులు కీలకంగా పని చేయాలని పార్టీ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగుళూరులోని వై కన్వెన్షన్హాల్లో నియోజకవర్గ యువజన, విద్యార్థి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 31న నియోజకవర్గ 5 వేల మందితో భారీ ఎత్తున యువజన బహిరంగ సభను నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ యువజన, విద్యార్థి విభాగం అధ్యక్షులు జెర్కోని రాజు, నిట్టు జగదీశ్, నాయకులు నూతనగంటి శేఖర్, భరత్, కె సురేందర్‌రెడ్డి, పాయిళ్ల తిరుమల్‌రెడ్డి, బద్రీనాథ్, కొప్పు రాజశేఖర్, వినయ్‌రెడ్డి, సాయిగౌడ్, పాతూరి రాజేశ్‌గౌడ్, జీవన్‌రెడ్డి, ప్రవీణ్‌నాయక్, జానీపాష, చంద్రకాంత్, మనీశ్‌రెడ్డి, సుమన్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రతి గడపకు మ్యానిఫెస్టో
పెద్దఅంబర్‌పేట : బీఆర్ఎస్ మ్యానిఫెస్టో అన్ని వర్గాల ప్రజల మనసులు గెలుచుకున్నదని బాటసింగారం రైతు సేవాసహకార సంఘం చైర్మన్ లెక్కల విఠల్‌రెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు అక్బర్ అలీఖాన్, గౌరెల్లి సర్పంచ్ మల్లేశ్ అన్నారు. గురువారం అబ్దుల్లాపూర్‌మెట్ మండలం గౌరెల్లిలోని శివాలయం వద్ద బీఆర్ఎస్ మ్యానిఫెస్టోకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికీ మ్యానిఫెస్టోను తీసుకెళ్లి బీఆర్ఎస్ చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. మ్యానిఫెస్టోను ప్రతి గడపకు తీసుకెళ్లాలని ముఖ్య కార్యకర్తలకు సూచించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికీ వెళ్లి ప్రజలను కోరారు.

ఇబ్రహీంపట్నంరూరల్ : బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో పాటు మరోసారి గెలిస్తే చేపట్టే పథకాలపై బీఆర్ఎస్ నాయకులు కప్పాడులో ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు నిట్టు జగదీశ్వర్, నాయకులు పాల్గొన్నారు.
ప్రచారాన్ని ముమ్మరం చేయాలి
యాచారం : మండలంలో ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్‌గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. మండలంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేయాల న్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకు పోవాలన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చేసిన కృషిని ప్రజలకు వివరించాలన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ అభ్యర్థి కిషన్‌రెడ్డిని నాలుగో సారి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. మండలంలో రేపటి నుంచి ఇంటి ంటి ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కస్తాలలో సబ్ స్టేషన్ ముందు రైతుల నిరసన
విద్యుత్ వైరు తెగిపడి పాడి బర్రె మృతి
Crazy Kalyanam | ‘క్రేజీ కళ్యాణం’ రివ్యూ.. అనుపమ, తరుణ్ భాస్కర్ల సినిమా ఎలా ఉంది?
AP News | వైసీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. అధికారంలోకి రావడం ఖాయం, వడ్డీతో కలపి చెల్లిస్తాం
Share Market | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 413 పాయింట్లు లాభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

