బొంరాస్ పేట్, ఏప్రిల్ 14 : దుద్యాల మండలం గౌరారం గ్రామంలో ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రాజతోత్సవం బహిరంగ సభ గోడ పత్రికను ఆవిష్కరించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ బహిరంగ సభను ఈనెల 27న ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిర్వహిస్తున్నారని వారు తెలిపారు.
కొడంగల్ నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు నాయకులు తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చాంద్ పాషా, యాదగిరి, మహేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, నారాయణరెడ్డి,రవి గౌడ్, ఎర్రంపల్లి శీను, కోట్ల మహిపాల్, లగచర్ల సురేష్, నరేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.