బీఆర్ఎస్ రజతోత్సవ సభ.. కాంగ్రెస్‌పై దండయాత్రగానే తెలంగాణ ప్రజలు భావించారు. అందుకే సభకు అంచనాకు మించి స్వచ్ఛందంగా లక్షలాదిగా జనం తరలివస్తున్నారు.. అని మాజీ మంత్రి వీ శ్రీనివాసగౌడ్ తెలిపారు.
దుద్యాల మండలం గౌరారం గ్రామంలో ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రాజతోత్సవం బహిరంగ సభ గోడ పత్రికను ఆవిష్కరించారు.