హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ రజతోత్సవ సభ.. కాంగ్రెస్‌పై దండయాత్రగానే తెలంగాణ ప్రజలు భావించారు. అందుకే సభకు అం చనాకు మించి స్వచ్ఛందంగా లక్షలాదిగా జనం తరలివస్తున్నారు.. అని మాజీ మంత్రి వీ శ్రీనివాసగౌడ్ తెలిపారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ సభతో కేసీఆర్‌పై ప్రజల్లో ఆశలు చిగురించాయని స్పష్టంచేశారు. రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగంపై ప్రజల్లో ఆసక్తి నెలకొన్నదని తెలిపారు. సభకు తరలివచ్చే ప్రతి వాహనంపై తప్పకుండా కేసీఆర్ బొమ్మ ఉన్న స్టిక్కర్‌ను అతికించాలని, బీఆర్ఎస్ జెండా కట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు కురువ విజయ్‌కుమార్, అభిలాశ్ రంగినేని, తుంగబాలు, మహిపాల్, శ్రీనివాసయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్ల టౌన్, ఏప్రిల్ 26 : బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఒక ప్రభంజనం కావాలని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భగా శనివారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలోని 27 వార్డులు, మండలంలోని గంగాపూర్‌లో గులాబీ జెండాల ను నాయకులతో కలిసి ఆవిష్కరించారు.
అచ్చంపేట టౌన్, ఏప్రిల్ 26: రజతోత్సవ సభకు అచ్చంపేట నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు దండు లా తరలివెళ్లాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు పిలుపునిచ్చారు. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): ఎల్కతుర్తిలో ఆదివారం జరిగే రజతోత్సవ సభతో బీఆర్ఎస్కు మళ్లీ పూర్వవైభవం దక్కుతుందని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ శనివారం ప్రకటనలో ధీమా వ్యక్తంచేశారు. గులాబీ దళపతి కేసీఆర్ సారథ్యంలో మరో విజయ ప్రస్థానానికి పార్టీ సిద్ధమవుతుందని తెలిపారు. ప్రతి కార్యకర్త గుండెనిండా ఆశలు చిగురించాయన్నారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన బీఆర్ఎస్.. బంగారు తెలంగాణ బాట నిండా గులాబీలు పరుస్తున్నదన్నారు.
వనపర్తి, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : ఎల్కతుర్తిలో ఆదివారం జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ నూతన శకానికి నాంది పలుకనున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని పార్టీశ్రేణులు దండులా కదిలిరావాలని పిలుపునిచ్చారు.
పెగడపల్లి, ఏప్రిల్ 26 : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించే రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుందని మాజీ మంత్రి కొప్పు ల ఈశ్వర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లిలో శనివారం పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. రజతోత్సవ సభకు జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల నుంచి లక్ష మంది వరకు హాజ రు కానున్నారని తెలిపారు. ధర్మపురి నియోజకవర్గం నుంచే 10 వేల మంది వరకు తరలుతున్నట్టు వివరించారు.
నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 26: బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ మాట వింటే గుండె ధైర్యం వస్తదని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పేర్కొన్నా రు. ఆదివారం ఎల్కతుర్తి వద్ద నిర్వహించనున్న బహిరంగ సభకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ స్థాపించిన గులాబీ పార్టీ 25 ఏండ్లుగా ప్రజలకు గుండె ధైర్యాన్ని ఇచ్చిందని గుర్తుచేశారు.
ఆ రైతు వయసు 75 ఏండ్లు కన్న కొడుకు చనిపోయినప్పుడు కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బీమా ఆదుకుంది. దీంతో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం చంద్రుతండాకు చెందిన రైతు భూక్యా గంగ్యానాయక్ గుండె నిండా కేసీఆర్‌పై కృతజ్ఞత నింపుకొని కాలినడకన(75 కిలోమీటర్లు) ఎల్కతుర్తిలోని బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బయలుదేరాడు. శనివారం వరంగల్ జిల్లా నెక్కొండలో బీఆర్ఎస్ నాయకులు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.
– నెక్కొండ