కడ్తాల్, ఏప్రిల్ 26: వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జాతరలా తరలిరావాలని బీఆర్ఎస్ పార్టీ కడ్తాల్ మండలాధ్యక్షుడు పరమేశ్ అన్నారు. శనివారం మధ్యాహ్నం మండల కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ నివాసంలో, స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని తెలిపారు.
పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రామ గ్రామాన పండుగ వాతావరణంలో నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో పార్టీ జెండాను ఎగురవేసి సంబురాలు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ వీరయ్య, మాజీ సర్పంచులు కృష్ణయ్యయాదవ్, జంగయ్యగౌడ్, భూనాథ్నాయక్, బీఆర్ఎస్ అన్మాస్‌పల్లి గ్రామాధ్యక్షుడు మహేశ్‌యాదవ్, నాయకులు కోట్యానాయక్, రామకృష్ణ, ప్రశాంత్ పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : నేడు ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి, పార్టీ చేవెళ్ల మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్ తెలిపారు. శనివారం చేవెళ్ల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలో నిర్వహించనున్న రజతోత్సవ మహాసభకు వెళ్లడానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
చేవెళ్ల నియోజకవర్గం నుంచి అన్ని వాహనాలు చేవెళ్లలోని వేంకటేశ్వర స్వామి దేవాలయం వద్దకు చేరుకుని అక్కడి నుంచి ర్యాలీగా వరంగల్ సభకు తరలివెళ్లనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఈర్లపల్లి మాజీ సర్పంచ్ మహేందర్‌రెడ్డి, ముడిమ్యాల డైరెక్టర్ మాధవరెడ్డి, నాయకులు కర్ణాకర్‌రెడ్డి, గణేశ్, సత్తి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం : నేడు ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవాలకు నియోజకవర్గం నుంచి లక్షలాదిగా తరలిరావాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఇబ్రహీంపట్నం నుంచి బహిరంగసభకు వెళ్లే కార్లు, ఇతర వాహనాలకు ఆయన ఇబ్రహీంపట్నంలో శనివారం సభ స్టిక్కర్లను అంటించారు.
తుర్కయాంజాల్ : బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరై వేడుకలను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అశోక్ అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నేడు వరంగల్‌లో జరుగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు కార్యకర్తలు హాజరు కావాలని ఆయన కోరారు.
ఆమనగల్లు : వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోనుగోటి అర్జున్‌రావు అన్నారు. శనివారం శెట్టిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి మండల అధ్యక్షుడు అర్జున్‌రావు ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వెంకటయ్య, జంగయ్య, కేశయ్య, జంగయ్య, రంగారావు, పోచయ్య, యాదయ్య, మైసయ్య, రాములు గౌడ్, వెంకటయ్య, రాములు ఉన్నారు.
మొయినాబాద్ : బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు తరలివెళ్లే ప్రతి గ్రామంలో పండుగ వాతావరణంలో జెండా ఆవిష్కరణ మహోత్సవం నిర్వహించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ రెండున్నర దశాబ్దాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో నేడు ఎల్కతుర్తిలో నిర్వహించే రజతోత్సవ మహాసభకు గ్రామగ్రామం నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. నేడు నిర్వహిస్తున్న సభకు నాయకులు, కార్యకర్తలు జాగ్రత్తలు తీసుకుని వెళ్లి తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకునే విధంగా ఆయా గ్రామాల నాయకత్వ బాధ్యతలు తీసుకోవాలని అన్నారు.
చేవెళ్ల రూరల్ : బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ప్రతి గ్రామం నుంచి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఆదిబట్ల, ఏప్రిల్ 26: ఆదిబట్ల మున్సిపల్ బీఆర్ఎస్ నాయకులు మాజీ కో ఆప్షన్ సభ్యుడు గోపాల్‌గౌడ్, మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు జంగయ్య అన్నారు. శనివారం వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ నుంచి సభకు స్వచ్ఛందంగా తరలిరావాలని వారు కోరారు.
అబ్దుల్లాపూర్‌మెట్ : ఎల్కతుర్తిలో నేడు జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మండలంలోని అన్ని గ్రామాలను నుంచి బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కొత్త కిషన్‌గౌడ్ పిలుపునిచ్చారు.
కొందుర్గు : బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేద్దామని ఆ పార్టీ కొందుర్గు మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. రజతోవ్స సభకు బయలుదేరేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, మండలం నుంచి పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.