లగచర్ల ఘటనలో అరస్టైన వారికి నాంపల్లి ప్రత్యేక కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేయగా.. చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి గురువారం సాయం త్రం 6.50 గంటలకు జైలు నుంచి బయటికొచ్చారు. ఆయన రాక కోసం బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు,అభిమానులు, జైలు వద్ద సాయంత్రం 5 గంటల నుంచే వందలాదిగా ఎదురుచూశారు. ఆయన బయటికి రాగానే ఎదురెళ్లి ఘన స్వాగతం పలికారు. వీరతిలకం దిద్ది, కండువాలు కప్పి భుజాలపైకి ఎత్తుకోగా ఆయన ప్రతి ఒక్కరికీ అభివాదం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు జైలు పరిసరాల్లో పటాకులు కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం పట్నం నరేందర్రెడ్డి హైదరాబాద్లోని తెలంగాణ భవన్కు వెళ్లగా.. అక్కడ గిరిజనులు హారతిచ్చి.. పూలు చల్లి ఘన స్వాగతం పలికారు.