నేడు కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్
చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మంగళవారం నామినేషన్ వేయనున్నట్లు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తెలిపారు. సోమవారం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ అధ్యక్షుడు అంతారం నరేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.
- హాజరుకానున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- క్యాంపు ఆఫీస్ నుంచి భారీ ర్యాలీ : రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్
బండ్లగూడ, ఏప్రిల్ 22 : చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మంగళవారం నామినేషన్ వేయనున్నట్లు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తెలిపారు. సోమవారం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ అధ్యక్షుడు అంతారం నరేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.
ఈ నామినేషన్ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ హాజరవుతారన్నారు. ఉదయం 10గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి రిటర్నింగ్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. బీసీ నేత, బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు.
నాయకులందరూ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయాలన్నారు. కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ రాందాస్, కో ఆప్షన్ సభ్యులు మలాకీ రత్నం, జగదీశ్, యువజన సంఘం అధ్యక్షుడు మల్లేశ్ యాదవ్, మాజీ ఎంపీపీ తలారి మల్లేశ్, సీనియర్ నాయకులు నవాబు ముంతాజ్, విష్ణువర్ధన్‌రెడ్డి, రాజు, రజాక్, గోపాల్, సాయిబాబాగౌడ్, వెంకటేశ్, నర్సింహగౌడ్, చందు, రాముడు యాదవ్, సాదిక్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

