బండి సంజయ్‌ని బర్తరఫ్ చేయాలి
బండి సంజయ్‌ని కేంద్ర కేబినెట్ నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశా రు. బాధితురాలికి న్యాయం జరగాలంటే ఆయన మంత్రివర్గంలో ఉండొద్దన్నారు. బండి భగీరథ్‌ను మా ప్రభుత్వం అరెస్టు చేసిందని రేవంత్‌రెడ్డి చెబుతుంటే..
- బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్
వికారాబాద్, మే 17 : బండి సంజయ్‌ని కేంద్ర కేబినెట్ నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశా రు. బాధితురాలికి న్యాయం జరగాలంటే ఆయన మంత్రివర్గంలో ఉండొద్దన్నారు. బండి భగీరథ్‌ను మా ప్రభుత్వం అరెస్టు చేసిందని రేవంత్‌రెడ్డి చెబుతుంటే.. కాదు కాదు తానే లాయర్లను వెంటబెట్టి నా కొడుకును ఠాణాలో పోలీసులకు సరెండర్ చేసినట్టు బండి సంజయ్ పేర్కొంటున్నారన్నా రు. న్యాయవ్యవస్థపై గౌరవం ఉండడంతోనే పోలీసులకు అప్పగించినట్టు ప్రగల్భాలు పలుకుతున్న ఆయన తొమ్మిది రోజులపాటు ఈ ఆలోచన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కోర్టుల్లో బెయిల్ వచ్చే అవకాశం లేదని గ్రహించే తప్పని పరిస్థితుల్లో కొడుకును అప్పగించిన మీకు మంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదన్నారు.
పేదల నడ్డి విరిచారు..
కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేదల నడ్డి విరించిందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు రాష్ర్టాల ఎన్నికలు ముగిసి.. ఫలితాలు వెల్లడి కాగానే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేదలపై పెట్రో భారం మోపిందని దుయ్యబట్టారు. ఈ పెంపు సామాన్యులకు పెను భారంగా మారందని.. నిత్యావసరాలు పెరిగి పేదలు జీవించలేని పరిస్థితి వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ప్రజలపై.. వారి బాగోగులపై లేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి పెట్రోల్, డీజిల్, వాణిజ్య గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

