యాచారం, అక్టోబర్ 14 : రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమం తిరిగి కొనసాగాలంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్‌గౌడ్ అన్నారు. మండలంలోని మంథన్‌గౌరెల్లి గ్రామంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. గ్రామంలో బీఆర్ఎస్ బూత్ కమిటీలను నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి గడపకు తీసుకెళ్లాలన్నారు. ముఖ్యంగా మండలంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చేపట్టిన అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. నియోజకవర్గం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే కిషన్‌రెడ్డిని నాలుగోసారి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. బీఆర్ఎస్ గెలుపులో బూత్ కమిటీలు కీలక పాత్ర పోషించాలన్నారు. మండలంలోని నజ్దిక్ సింగారం గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు వన్నవాడ పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో బూత్ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ కారింగ్ యాదయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శంకర్‌నాయక్, సర్పంచ్ విజయలక్ష్మి, నాయకులు కిషన్, వరప్రసాద్‌రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులున్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చీరాల రమేశ్ అన్నారు. వివిధ గ్రామాల్లో బూత్ స్థాయి కమిటీల సమావేశాలను నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్మద, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, నాయకులు బుస్సు పుల్లారెడ్డి, బహదూర్, జ్ఞానేశ్వర్, దండేటికార్ రవి, నర్సింగ్ వెంకటేశ్ గౌడ్, చిందం రఘుపతి, బద్రినాథ్గుప్తా పాల్గొన్నారు.
ప్రతిక్షణం అభివృద్ధి కోసం పరితపించే ఇబ్రహీంపట్నం అభివృద్ధి ప్రదాత, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీపీ కృపేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బుగ్గరాములు అన్నారు. మండల పరిధిలోని రాయపోల్, ముకునూరు, కర్ణంగూడ గ్రామాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి మరోసారి ప్రజలు అవకాశం కల్పిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందటంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా మెరుగవుతాయన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, సర్పంచ్‌లు బూడిద రాంరెడ్డి, బల్వంత్‌రెడ్డి, జ్యోతి, ఎంపీటీసీలు అచ్చన శ్రీశైలం, జ్యోతి, బీఆర్ఎస్ గ్రామ శాఖల అధ్యక్షులు బాలుగౌడ్, శ్రీనివాస్, గోవర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు నిట్టు జగదీశ్వర్, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మన్, నర్సింహ, శ్రీనివాస్, బాలరాజు, అశోక్‌గౌడ్‌తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలే గెలిపిస్తాయి
ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తూ పార్టీని గెలిపించాలని మిషన్ భగీరథ వైస్ చైర్మన్, జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్ అన్నారు. శనివారం మండలంలోని పెద్దూర్‌తండా, వెంకటాపూర్‌తండా, వెంకటాపూర్ గ్రామ పంచాయతీలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు మేలు జరిగిందని వివరించారు. కార్యక్రమంలో ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ నిర్మల, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుమ్మరి శంకర్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు నర్సింహ, సర్పంచ్‌లు సక్రి, లక్ష్మణ్‌నాయక్, ఉపసర్పంచ్ తిరుపతి, నాయకులు స్వామిగౌడ్, కిషన్, వెంకటయ్య పాల్గొన్నారు.