ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 29 : అబద్ధాల కాంగ్రెస్‌కు కాలం చెల్లిందని..మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన ఆ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని శేరిగూడలో ఉన్న సీకే కన్వెన్షన్ హాల్లో బీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది.
దీనికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. ప్రజలు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నందుకు ఆవేదన చెందుతున్నారని.. అన్ని వర్గాలకు మేలు చేసిన కేసీఆర్‌ను ఓడించామని బాధపడుతున్నారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఒక్క దానిని కూడా సక్రమంగా అమలు చేయడంలేదని.. హామీలను నెర వేర్చాలని అడిగిన వారిని పోలీసులతో అణచివేయిస్తున్నదని దుయ్యబట్టారు. రెండు లక్షల ఉద్యోగాలను ఏడాదిలో భర్తీ చేస్తామని చెప్పి అధికారంలోకి రాగానే నిరుద్యోగులను మోసం చేసిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఇంటింటికెళ్లి గుర్తు చేయాల్సిన బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలపై ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం, ప్రజల కోసం పని చేసే వారిని అభ్యర్థులుగా నిలబెట్టి గెలిపించుకుందామన్నారు. అనంతరం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభు త్వం హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
అనంతరం రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో గ్రం థాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, సీనియర్ నాయకులు జక్క రాంరెడ్డి, దండెం రాంరెడ్డి, ఆకుల యాదగిరి, పల్లె గోపాల్‌గౌడ్, బూడిద రాంరెడ్డి, చక్రవర్తిగౌడ్, మాజీ ఎంపీపీలు కృపేశ్, రజితారాజూనాయక్, మండలపార్టీ అధ్యక్షులు రమేశ్‌గౌడ్, బుగ్గరాములు, కిషన్‌గౌడ్, రమేశ్, మున్సిపల్ అధ్యక్షులు కొప్పు జంగయ్య, అల్వాల వెంకట్‌రెడ్డి, కల్యాణ్‌నాయక్, బొక్క గౌతమ్‌రెడ్డి, బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు జగదీశ్వర్, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధికంగా పాల్గొన్నారు.