ఇబ్రహీంపట్నం/ఇబ్రహీంపట్నంరూరల్, మే 19 : బీఆర్ఎస్పార్టీ రంగారెడ్డిజిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాతృమూర్తి మంచిరెడ్డి పద్మమ్మ గురువారం అర్ధరాత్రి స్వగ్రామమైన ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామంలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిచెందిన విషయం తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తల్లి పద్మమ్మ మృతిచెందిన విషయం తెలుసుకున్న రాష్ట్ర విద్యా శాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశ్, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, కాలె యాదయ్య, అంజయ్యయాదవ్, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి ఆమె మృతదేహానికి నివాళులర్పించారు. అంత్యక్రియల్లో ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, తుర్కయంజాల్, ఆదిబట్ల, పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీలకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్దుమెంబర్లు, బీఆర్ఎస్పార్టీ బాధ్యులు పాల్గొని నివాళులర్పించారు. ఈ అంత్యక్రియల్లో మేడ్చల్ జడ్పీ చైర్పర్సన్ శరత్‌చంద్రారెడ్డి, అడిషనల్ డీజీపీ శివధర్‌రెడ్డి, రాచకొండ సీపీ డీహెచ్ చౌహాన్, డీసీపీలు శ్రీనివాస్, సాయిశ్రీ, మాజీ ఎమ్మెల్యేలు కోదండారెడ్డి, మలిశెట్టి సుధీర్‌రెడ్డి, కోదండరెడ్డి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ వెంకటరమణారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్‌చైర్మన్ సత్తయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్, సీపీఎం, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఆమనగల్లు : ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తల్లి పద్మమ్మ మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వేర్వేరుగా వారి స్వగ్రహం ఎలిమనేడులో పద్మమ్మ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని పరామర్శించారు. పరామర్శించిన వారిలో ఎమ్మెల్సీ నారాయణరెడ్డి సతీమణి మాధవి ఉన్నారు.