MLA Marri Rajashekar Reddy | మల్కాజిగిరి, జూన్ 20 : సమాజ సేవకు యువత ముందుకు రావాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నెరేడ్మెట్లోని ప్రభుత్వ మండల ప్రాథమిక స్కూల్లో విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్, పెన్సిల్ కిట్లను ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. యువకులు సమాజ సేవ చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది యువత ముదుకువస్తారని ఆశిస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం ఎంతో నాణ్యంగా ఉందని ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోందని, బడిబాట కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసారని అన్నారు. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్ తో పాటు మధ్యాహ్నం భోజనం ప్రభుత్వం ఉచితంగా అందిస్తుండడంతో చాలామంది విద్యార్థులు స్కూళ్లలో చేరుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. స్థానిక యువకులు వినీత్, జగదీశ్, సాయి విద్యార్థులకు అవసరమైన కిట్ లను ఉచితంగా అందజేసిన యువకులను అభినందిస్తున్నానని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయప్రద, నాయకులు బద్దం పరశురాం రెడ్డి, రాము యాదవ్, శ్రీనివాస్, గుత్తి చందు తదితరులు పాల్గొన్నారు.