Marri Rajashekar Reddy | మల్కాజిగిరి, మే 15: వరద ముంపు నివారణ చర్యలు తీసుకుంటున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం అల్వాల్ డివిజన్లోని చిన్న రాయిని చెరువును దాని పరిసర ప్రాంతాలను జిహెచ్ఎంసి అధికారులతో కలసి ఎమ్మెల్యే పరిశీలించార. వెంకటాపురం డివిజన్ ఖానాజిగూడలో చలివేంద్రన్ని ఎంబీసీ మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్న రాయిని చెరువు ఎగువ ప్రాంతాల నుండి వచ్చే నీటితో జానకి నగర్లోని ఇండ్ల లోపలకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వరద నీటి దిగువ ప్రాంతానికి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. వేసవి కాలంలో ప్రజలకు ఇబ్బందులు కాకుండా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంబీసీ మాజీ చైర్మన్ నంది కంటి శ్రీధర్, కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా కిషోర్, డిఈలు ఇంజనీర్ శుక్లజ, అనిత, ప్రశాంతి, ఏఈ వరుణ్ దేవ్, జలమండలి అధికారి సాంబయ్య, డోలి రమేష్, అనిల్ కిషోర్, శ్రీనివాస్, యాదగిరి గౌడ్, ప్రేమ్ కుమార్, శరన్ గిరి, పవన్, అరుణ్, హరిబాబు, వై సదానంద్, వీరేష్, కన్నా, శంకర్, రాజు, రాజశేఖర్, నవీన్, రాము, కృష్ణ, జమేధర్, శ్రీనివాస్, ప్రవీణ్, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.