MLA Marri Rajashekar Reddy | నేరేడ్మెట్, జూలై 11 : మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని, ప్రతి డివిజన్లో అవసరమైన అభివృద్ధి పనులు యుద్ద ప్రాతిపదికన చేపడుతున్నామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నేరేడ్మెట్ డివిజన్ యాప్రాల్ రాఘవ కల్యాణ్పార్కు, డిఫెన్స్‌కాలనీలో సీసీ రోడు భరణీకాలనీలో స్మశానవాటిక తదితర కాలనీల్లో సుమారు రూ. 44.2 లక్షల నిధులతో అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్ మీనా ఉపేందర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం , అభివృద్ధి కోసం చిత్తశుద్దిదతో పనిచేస్తున్నామని, నియోజకవర్గాన్ని అని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దతానని అన్నారు. సీసీ రోడ్లతో పాటు మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మణ్, ఏఈ సృజన, స్థానిక కార్పొరేటర్ మీనా ఉపేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు బద్దం పరశురాంరెడ్డి, రావుల అంజయ్య, జేఏసి వెంకన్న, జీకే హన్మంతరావు, గోపు రమణారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, చిందం శ్రీనివాస్, శివగౌడ్, శంకర్ రావు, శ్రీనివాస్, లక్ష్మణ్ యాదవ్, హేమంత్ పటేల్, రమేస్, జెకె సాయిగౌడ్, సుమన్‌గౌడ్, నవీన్ బాలరాజు, సుమన్ సింగ్, రాజు, గంగాధర్, వాసు, రాజశేఖ, వంశీ, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.