MLA Marri Rajashekar Reddy | మల్కాజ్గిరి మే 1 : కార్మికుల హక్కుల కోసం పోరాడుతామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా బోయిన్పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో బీఆర్టీయూ జెండా, అల్వాల్ సర్కిల్ ఐజి చౌరస్తా వద్ద లేబర్ అడ్డాలో కార్మికుల జెండాను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, పార్లమెంట్ ఇన్ చార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కార్మికులకు మేడే శుభాకాంక్షలు.. కార్మికుల హక్కులను కాపాడేందుకు పోరాటం చేస్తామన్నారు. 1886లో చికాగోలో పని గంటలు తగ్గించాలని జరిగిన ఒక నిరసన ఊరేగింపుపై అమెరికా పోలీసులు కాల్పులు జరపటంతో కార్మికులు నెత్తురు పారిందన్నారు. నాటి అమరులను తల్చుకుంటూ ప్రతీ యేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ గజ్జల నగేష్, బీఆర్టీయూ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శంభు ప్రభాకర్, రవి చారి, సురేష్, సంతోష్, సిరాజుద్దీన్, అమినుద్దీన్, రమేష్, శివకుమార్, భాగ్యనంద సుమన్, సాయి, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు జాజుల బాలయ్య, మల్లేష్, పరమేష్, శరణగిరి, అరుణ్, తేజ రావ్, పవన్, సురేష్, ప్రశాంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.