అల్వాల్ : అల్వాల్‌లోని మచ్చబొల్లారం డివిజన్ బాలాజీ రాధాక్రిష్ణ మఠం ( Balaji Radha Krishna ) దేవాలయం భూముల లీజ్‌ను ( Lease Cancell ) వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్( BRS ) శ్రేణులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డోరి రమేశ్ మాట్లాడుతూ మఠానికి సంబంధించిన పూజారులు దేవాలయ ప్రధాన సంరక్షకులుగా ముత్తాతల వంద ఏండ్ల నుంచి దేవుడికి దూప,దీప నైవేద్య సేవలను అందిస్తున్నారని వివరించారు.
మఠానికి సంబంధించిన సర్వే నంబర్ 91లో ఎకరం 10 గుంటల దేవాలయ భూమిని దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో ముక్తిదాం చారిటబుల్ ట్రస్ట్ (Charitable Trust) కు ఆపార కర్మల నిర్వాహణకు 11 సంవత్సరాల పాటు నెలసరి అద్దె ప్రాతిపాదికన లీజ్ తీసుకున్నారని తెలిపారు. ఈ లీజ్తో స్థానికంగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయని వివరించారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా లీజ్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చాడని గుర్తు చేశారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి దేవాదాయ భూమిని ప్రైవేట్ చారిటబుల్ ట్రస్ట్ చేసుకున్న లీజ్‌ను వెంటనే రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు సురందర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు డప్పు రాజు, శోభన్‌బాబు, నార్ల సురేశ్, రేవంత్‌రెడ్డి, భాస్కర్‌గౌడ్, శంకర్‌రెడ్డి, కాంతిదాస్, తుల్జాదేవి, లక్ష్మి, ప్రభావతి తదితరులు ఉన్నారు.