కడ్తాల్, సెప్టెంబర్ 21 : ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది అని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రానికి చెందిన కాకర్ల రాములయ్య అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందాడు. ఈ విషయాన్ని స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఆనంద్ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ మేరకు ఆదివారం బీఆర్ఎస్ నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆనంద్ సమాకూర్చిన రూ.5 వేలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కష్టాల్లో ప్రతి ఒక్కరిని బీఆర్ఎస్ పార్టీ ఆదుకుంటుందని తెలిపారు. ప్రజా సేవ చేయడానికి పదవులు అవసరం లేదన్నారు. పరామర్శించిన వారిలో బీఆర్ఎస్ నాయకులు అంజి, వెంకటేశ్, శ్రీశైలం, శ్రీకాంత్, బాబులు, జంగయ్య, మల్లేశ్ ఉన్నారు.