Telangana | చేవెళ్లటౌన్, ఫిబ్రవరి 17 : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి, కరెంట్ కోతలతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని చేవెళ్ల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి దేశమొల్ల అంజనేయులు, మండల పార్టీ అద్యక్షుడు ప్రభాకర్, చేవెళ్ల నియోజకవర్గం యూత్ అధ్యక్షులు వంగ శ్రీధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మంగలి బాల్ రాజ్ అరోపించారు. రైతులకు 24గంటల కరెంట్ ఇవ్వాలని సోమవారం చేవెళ్ల మండల కేంద్రంలోని విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, కాంగ్రెస్ పాలన మాకొద్దురా నాయనా అంటూ నినాదాలు చేశారు. అనంతరం విద్యుత్ ఏఈ రాజేందర్‌కు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వినతిపత్రం అందజేశాయి.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే విద్యుత్ కోతలు మొదలయ్యాయని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కరెంట్ కోతలు లేవని తెలిపారు. చేవెళ్ల మండలంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని.. రోజుకు 5 నుంచి 6 గంటల వరకు కరెంట్ పోతుందని అరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తానని చెప్పి ఇప్పుడు ప్రతిరోజూ కోతలు విధిస్తుందని బీఆర్ఎస్ నాయకుడు మండిపడ్డారు.అధికార దాహంతో కాంగ్రెస్ ఎన్నికల ముందు 420 హామీలు ఇచ్చి ఒక హామీలు కూడా అమలు చేయకుండా రైతులను, ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఆరు గ్యారెంటీలో అర గ్యారంటీ కూడా అమలు చేయని రేవంత్ రెడ్డి రోజుకో మాట మాట్లాడుతూ కాలం వెలదీస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు చేసింది ఏమిలేదని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వేజ్ బోర్డు మాజీ చైర్మన్ పులి మామిడి నారాయణ, చేవెళ్ల నియోజకవర్గం యూత్ అధ్యక్షులు వంగ శ్రీధర్ రెడ్డి, వైస్ ఎంపీపీ ప్రసాద్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సింలు, మాజీ సర్పంచ్‌లు జంగారెడ్డి, సులోచన అంజన్ గౌడ్, పామెన మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ చారి, న్యాలట మాజీ ఎంపీటీసీ ఎల్లయ్య, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్లు వెంకటేశ్, నాయకులు విఘ్నేశ్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, పాండు, శంకరయ్య, నత్తి కృష్ణా రెడ్డి, రాజు, తండు సత్తి, దర్శన్, గని, మహేందర్, రాఘవేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.