‘ఇందిరమ్మ రాజ్యమంటే మహిళలను అగౌరవపర్చడమేనా.. ఒక మహిళా ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం.. ఇది యావత్ మహిళా లోకానికి జరిగిన అవమానం.. వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే సబితారెడ్డికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి’ అని పలువురు మహిళలు, బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. బుధవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే సబితారెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు చేసిన అవమానకర వ్యాఖ్యలను నిరసిస్తూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. పలుచోట్ల సీఎం, డిప్యూటీ సీఎంల దిష్టిబొమ్మలను దహనం చేసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఆర్కేపురం, జూలై 31 : సబితారెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ అర్కేపురంలోని ఎన్టీఆర్నగర్ చౌరస్తాలో మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్‌శర్మ, ఆర్కేపురం డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు పెండ్యాల నగేశ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సబితారెడ్డిని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలకు లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడానికి మహిళలే ప్రధాన కారణమని, అలాంటి మహిళలను విమర్శించి బాధ పెట్టడం తగదన్నారు. కార్యక్రమంలో న్యాలకొండ శ్రీనివాస్‌రెడ్డి, గొడుగు శ్రీనివాస్, జై శ్రీమన్నారాయణ, కంచర్ల శేఖర్, మంత్రి రవీందర్రావు, శ్యామ్గుప్తా, శ్రీరాములు, జహీర్, మురళీధర్‌రెడ్డి, నవీన్‌గౌడ్, అనురాధ, రోజా, పద్మ, జయమ్మ తదితరులు ఉన్నారు.
మీర్‌పేటలో..
బడంగ్‌పేట : మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దిష్టిబొమ్మలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్యక్షుడు అర్కల కామేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో దహనం చేశారు. ఎమ్మెల్యే సబితారెడ్డిని అవమానించిన రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్కలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, కార్పొరేటర్లు అనిల్‌కుమార్ యాదవ్, రాజేందర్‌రెడ్డి, సిద్ద్దాల లావణ్యబీరప్ప, బీఆర్ఎస్ నాయకులు దిండు భూపేశ్‌గౌడ్, విజయలక్ష్మి, యాదగిరి, పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, సురభి లత, మాధవి, గోపీయాదవ్, బషీర్, నాగరాజు, జంగయ్య, మహేందర్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.