షాబాద్, ఆగస్టు 21: రోడ్డుపై ఏర్పడిన గుంతలను బీఆర్ఎస్ పార్టీనాయకులు పూడ్చి వేయించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని హైతాబాద్ గ్రామంలో వర్షాలకు రోడ్డుపై భారీ గుంతలు పడడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఏండీ చాంద్‌పాషా, గ్రామ మాజీ సర్పంచ్ దర్శన్ గురువారం రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో మట్టి పోయించి పూడ్చి వేయించారు.
పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో వాహనదారులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రమాదాలు జరుగకుండా తమవంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను పలువురు అభినందించారు.