కడ్తాల్, జూన్ 1: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల పరిధిలోని హర్యానాయక్ తండాలో ఆదివారం నాడు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భీణీలకు మెడికల్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. తండాకి చెందిన పలువురు బీఆర్ఎస్ గిరిజన నాయకులు ఇంటింటికి తిరిగి గర్భిణులకు మెడికల్ కిట్లను అందజేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. పేద ప్రజలను ఆదుకోవడమే లక్ష్యంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ పనిచేస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవ కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రఘుపతి నాయక్, మాజీ ఉప సర్పంచ్ నారాయణ, నాయకులు లచ్యా నాయక్, కృష్ణ నాయక్, నరేశ్, మల్లేశ్, శివ తదితరులు పాల్గొన్నారు.