HomeRangareddyBrs Leaders Celebration On Mlc Kavitha Bail
కవితకు బెయిల్ బీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తప్పుడు కేసు నమోదు చేసి ఐదు నెలలు జైలులో ఉంచిన తర్వాత న్యాయం గెలిచిందని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.
వికారాబాద్, ఆగస్టు 27 : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తప్పుడు కేసు నమోదు చేసి ఐదు నెలలు జైలులో ఉంచిన తర్వాత న్యాయం గెలిచిందని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. కుట్ర కోణంలో పెట్టిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కకి సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీంతో పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఆనందంతో పాటు ఎంతో బలాన్నిచ్చిందని తెలిపారు. అనంతరం సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీతో ఆధారం లేని కేసులను పెట్టించి రాజకీయ కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు.
బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా సుప్రీం కోర్టు ఎమ్మెల్సీ కవితకు న్యాయం చేసిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్వీట్లు పంచుకొని సంబురాలు చేసుకున్నారు. కౌన్సిలర్ అనంత్‌రెడ్డి, నాయకులు సుభాన్‌రెడ్డి, అనంత్‌రెడ్డి, యువ నాయకులు షఫీ, అనిల్ తదితరులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆనంద్ నివాసం వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్వీట్లు తినిపించుకొని సంబురాలు చేసుకున్నారు. సంబురాల్లో పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్ గోపాల్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పాండు, నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.
షాద్‌నగర్‌లో పండుగ వాతావరణం
షాద్‌నగర్, ఆగస్టు 27 : కక్షపూరిత రాజకీయాలకు పాల్పడి, ఆధారాల్లేని కేసుతో ఎమ్మెల్సీ కవితను బీజేపీ ప్రభుత్వం వేధించిందని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. కేవలం బీఆర్ఎస్పై ఉన్న కక్షతోనే మాజీ సీఎం కేసీఆర్ కుమారై అయిన ఎమ్మెల్సీ కవితపై అక్రమ కేసులు బనాయించి.. ఐదు నెలలపాటు జైల్లో ఉంచడం బాధాకరమన్నారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు నటరాజన్ ఆధ్వర్యంలో మంగళవారం షాద్‌నగర్ చౌరస్తాలో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడాన్ని హర్షిస్తూ బీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.
అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం పటాకులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. తెలంగాణ ఆడబిడ్డకు అన్యాయం చేసిన మోదీ ప్రభుత్వానికి రానున్న రోజు ల్లో తగిన బుద్ధి తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఈగ వెంకట్రాంరెడ్డి, రాజ్యలక్ష్మి, పిల్లి శేఖర్, జూపల్లి శంకర్, ముస్తాఫా, భాస్కర్, రాజశేఖర్, రాఘవేందర్‌గౌడ్, టీఆర్ఎస్వీ నాయకులు పాల్గొన్నారు.
శంషాబాద్‌లో..
శంషాబాద్ రూరల్ : ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరుపై మంగళవారం శంషాబాద్‌లో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడం సంతోషంగా ఉన్నదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నదన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కవితను అరెస్ట్ చేయించి ఆనందపడ్డారని విమర్శించారు.
ఐదు నెలలు జైలులో పెట్టినా.. లిక్కర్ కేసులో ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వారికి వ్యతిరేకంగా ఉన్న నాయకులను ఈడీ పేరుతో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని అన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ బుర్కుంట సతీశ్, దిద్యాల శ్రీనివాస్, మంచర్ల మోహన్‌రావు, చిన్నగుండు రాజేందర్, కుంచె జంగయ్య, కొమ్మ గోపాల్, లింగంశ్రీశైలం, జీ అశోక్, హరికృష్ణ, గుంటి చరణ్, రొడ్డ రాజు తదితరులు పాల్గొన్నారు.