మంచాల, జూన్ 1: సీసీ కెమెరాల ఏర్పాటుతో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేరాలను నియంత్రించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు మాజీ సహకార సంఘం చైర్మన్ మొద్దు సికిందర్ రెడ్డి అన్నారు. ఆదివారం మంచాల మండలం లోయపల్లి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం తన వంతు సహాయంగా రూ 50 వేల రూపాయల నగదును మంచాల సీఐ మధుకు అందజేశారు.
ఈ సందర్భంగా మొద్దు సికిందర్ రెడ్డి మాట్లాడుతూ.. లోయపల్లి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు గ్రామ అభివృద్ధి కూడా తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని చెప్పారు .