నందిగామ, డిసెంబర్ 9: గ్రామ గ్రామాన బీఆర్ఎస్ సర్పంచ్, వార్డు సభ్యులను గెలిపించి బీఆర్ఎస్ జెండాను ఎగరేయాలని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా మంగళవారం మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ నందిగామ, చేగూరు, అంతిరెడ్డిగూడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాయని, గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ ఈట గణేశ్, మాజీ సర్పంచ్ వెంకట్‌రెడ్డి, రాంరెడ్డి, మాజీ ఏఎమ్‌సీ చైర్మన్ నారాయణరెడ్డి, నాయకులు జనార్ధన్‌రెడ్డి, అంజయ్య, పెంటయ్య, కృష్ణయ్య, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
గ్రామాల్లో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన విధంగా బుద్ధి చెప్పాలని ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి అన్నారు. చేగూరులో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి మల్లేశ్‌గౌడ్‌కు మద్దతుగా నిర్వహించిన సమావేశంలో ఎమ్సెల్సీ నవీన్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ విఠ్టల్, మాజీ సర్పంచ్‌లు పాండయ్య, సంతోష, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
మొయినాబాద్ : ఎతుబార్పల్లి గ్రామం జనరల్ స్థానం కావడంతో బీఆర్ఎస్ అభ్యర్థిగా చింతకింది ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. అదే విధంగా అమ్డాపూర్‌లో కృష్ణ, చిన్నమంగళారంలో బ్యాగరి స్వరూప, మేడిపల్లి పొద్దుటూరు మల్లేష్, ఎల్కగూడలో రాజ్‌కుమార్, కుతుబుద్దీన్గూడలో ఎండీ పాష, రెడ్డిపల్లిలో మోహన్‌రెడ్డి, కనకమామిడిలో మురళీధర్‌రెడ్డి, కాశీంబౌలిలో మాడి రాజేందర్‌రెడ్డి, నాగిరెడ్డిగూడలో సంధ్యమనోజ్కుమార్, తోలుకట్టాలో మోండ్ర రవీందర్, వెంకటాపూర్‌లో పూలపల్లి రాణి ప్రచారంలో దూసుకెళుతున్నారు.
షాబాద్ : మండలంలోని కుమ్మరిగూడ, షాబాద్, హైతాబాద్, సోలీపేట్, సర్దార్‌నగర్, నాగరకుంట తదితర గ్రామాల్లో మంగళవారం బీఆర్ఎస్ అభ్యర్థులు ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. కుమ్మరిగూడలో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి పోనమోని శ్రీశైలంయాదవ్ గడపగడపకూ తిరిగి తనను సర్పంచ్‌గా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో సర్దార్‌నగర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, మాజీ జడ్పీటీసీ రాజేందర్‌గౌడ్, మాజీ సర్పంచులు కేతనరమేశ్యాదవ్, కల్వకోల్ వెంకట్‌యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నేతలు ఆంజనేయులు, మల్లయ్య, వెంకట్‌రెడ్డి, శ్రీను, నర్సింహులు, దర్శన్ తదితరులున్నారు.
చేవెళ్ల రూరల్ : చేవెళ్ల మండల పరిధిలోని కమ్మెట, ఈర్లపల్లి, కౌకుంట్ల, ముడిమ్యాల్, ఆలూర్ తదితర గ్రామాల్లో బీఆర్ ఎస్ పార్టీ తరఫున బలపర్చిన అభ్యర్థులు సతీశ్‌గౌడ్, వనం ప్రవీణ రవీందర్‌రెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, వెంకటేశ్, కసిరె విజయలక్ష్మి తదితరులు జోరుగా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు, కమ్మెట మాజీ సర్పంచ్ హన్మంత్‌రెడ్డి, నియోజకవర్గ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కరుణాకర్ రెడ్డి, శేరి దర్శన్, వనం మహేందర్‌రెడ్డి, ఈర్లపల్లి మాజీ ఉప సర్పంచ్ స్వర్ణలతా భాసర్, స్థానిక నేతలు పాల్గొన్నారు.
కేశంపేట : మండలంలోని లేమామిడి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి సులోచన, నిర్దవెల్లిలో పి.సురేందర్, తొమ్మిదిరేకులలో శ్రీదేవి, కాకునూరులో రాజు, చౌలపల్లిలో సావిత్రి, కొండారెడ్డిపల్లిలో ప్రేమ్‌కుమార్‌గౌడ్, లింగంధనలో వెంకటయ్య, పాపిరెడ్డిగూడలో పి.కవిత, కోనాయపల్లిల్లో ధనలక్ష్మి, ఎక్లాస్‌ఖాన్‌పేటలో ఎల్గనమోని హరిశేఖర్, ఇప్పలపల్లిలో మంజుల, సంగెంలో వేణుగోపాల్‌చారి, కొత్తపేటలో సుస్మిత, పోమాల్‌పల్లిలో బి.స్వప్న, వేముల్‌నర్వలో విజయలక్ష్మి, అల్వాలలో శ్రీనివాసులు ప్రచారం నిర్వహించారు.
షాద్‌నగర్ రూరల్ : ఎన్నికల ప్రచారానికి చివరిరోజు కావడంతో ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్, బీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లో ప్రచారం చేసి మాట్లాడారు.
ఫరూఖ్‌నగర్ మండలంలోని 47 గ్రామపంచాయతీలలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా పోలింగ్ ప్రకియను గురువారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఎంపీడీవో బన్సిలాల్ తెలిపారు. 47 గ్రామపంచాయతీలకు గాను 15 పోలింగ్ కేంద్రాలు, 410 పొలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 553 మంది పీవోలు, 553 మంది ఓపీవోలు, 12 మంది రూట్ ఆఫీసర్లు, నలుగురు జోన్ ఆఫీసర్లు విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. 12 రూట్లలో 35బస్సులను నడుపనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పోలీస్ అధికారులు బందోబస్తు నిర్వహించనున్నారు. సమస్యాత్మకమైన గ్రామాల్లో బందోబస్తు ఏర్పాటు చేయనున్ననట్లు పట్టణ సీఐ విజయ్‌కుమార్ తెలిపారు.