ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 25 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా పండుగను గ్రామగ్రామాన ఆ పార్టీ నాయకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి గ్రామాల్లో జెండావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని వేదా కన్వెన్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ప్రతినిధుల సమ్మేళనానికి తరలి వెళ్లారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఉదయం ఉప్పరిగూడ చౌరస్తా వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. మంచాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చీరాల రమేశ్ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, ఎంపీపీ నర్మద, సింగిల్‌విండో చైర్మన్ పుల్లారెడ్డి పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఆ పార్టీ అధ్యక్షుడు అల్వాల వెంకట్‌రెడ్డి జెండాను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మొద్దు అంజిరెడ్డి పాల్గొన్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సతయ్య, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డిలు జెండాను ఎగురవేశారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు కొత్త కిషన్‌గౌడ్,యాచారం మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్‌గౌడ్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జంగమ్మ, ప్రధాన కార్యదర్శి బాష పాల్గొన్నారు. ఆదిబట్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు కొప్పు జంగయ్య జెండాను ఆవిష్కరించారు. పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలో పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు సిద్దంకి కృష్ణారెడ్డి జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
షాద్‌నగర్ నియోజకవర్గంలో ..
షాద్‌నగర్ : షాద్‌నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు బీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ పాత్రను గుర్తు చేశారు. షాద్‌నగర్ పట్టణంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ బీఆర్ఎస్ జెండాను ఎగురవేయగా నందిగామ మండల కేంద్రంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్‌తో పాటు కొత్తూరు, చౌదరిగూడ, కొందుర్గు మండల కేంద్రాల్లో ఆ పార్టీ మండలాల అధ్యక్షులు జెండాలను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
చేవెళ్ల నియోజకవర్గంలో ..
షాబాద్ : చేవెళ్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా పండుగ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లోని ఆయా గ్రామాల్లో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు బీఆర్ఎస్ పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
తలకొండపల్లి : మండల వ్యాప్తంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. అనంతరం ప్రతినిధుల సమావేశానికి తరలి వెళ్లారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
మాడ్గుల : అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఏమిరెడ్డి జైపాల్‌రెడ్డి, కలకొండ మాజీ సర్పంచ్ పవన్‌కుమార్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.