ఇబ్రహీంపట్నం, మార్చి 25 : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఇబ్రహీంపట్నం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. అనంతరం మాట్లాడుతూ..అసాధ్య మనుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సుసాధ్యం చేసిన కేసీఆర్‌పై బండి సంజయ్ నిరాధార ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌పై కేసు నమోదు చేసి.. ఆయన మంత్రి పదవిని, పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్ కార్యాలయాన్ని కోరుతున్నామన్నారు. అదేవిధంగా మరోసారి ఆయన కేసీఆర్ కుటుంబంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. కాగా, బండి వ్యాఖ్యలను నిరసిస్తూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోని పలు ఠాణాల్లో బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మంగ ఐలేశ్, కరుణాకర్, గరిగె శేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.