జిల్లాలో గంగమ్మ పాతాళానికి చేరుతుండడంతో బోర్లు ఎండిపోతున్నాయి. 21 మండలాల్లో ఇప్పటికే 15,000 పైచిలుకు బోర్లు వట్టిపోయినట్లు అధికారులు ధ్రువీకరించా రు. అన్నదాతలు పంటలను కాపాడుకునేందుకు భగీరథ యత్నమే చేస్తున్నారు. ఒక్కో రైతు రూ. లక్షలు ఖర్చు పెట్టి మూడు నుంచి నాలుగు బోర్లు తవ్విస్తున్నా నీరు రాని దుస్థి తి నెలకొన్నది. దీంతో జిల్లాలో తాగు, సాగు నీటికి ముప్పు పొంచి ఉన్నది.
రంగారెడ్డి, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో తాగు, సాగునీటికి ముప్పు ముంచుకొస్తున్నది. భూగర్భజలాలు గణనీయంగా తగ్గిపోతుండడంతో ఎక్కడికక్కడ బోర్లు ఎండిపోతున్నాయి. ఇప్పటికే సుమారు 50 శాతానికి పైగా బోర్లు వట్టిపోయాయి. వీటి కింద ఉన్న పంట పొలాలు, అలాగే, గ్రామాల్లో ‘మిషన్ భగీరథ’కు తోడుగా ఉన్న బోరుబావులూ ఎండిపోతున్నాయి. కాగా జిల్లావాసులు మిషన్ భగీరథ నీటిపైనే ఆధారపడుతున్నారు. జిల్లాలోని 21 మండలాల్లో ఇప్పటికే సుమారు 15,000 పైచిలుకు బోర్లు ఎండిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. బోర్లు ఎం డిపోతుండడంతో పంటలను కాపాడుకునేందుకు అన్నదాతలు కొత్త బోర్లు తవ్విస్తున్నా నీరు రాని పరిస్థితి నెలకొన్నది. గతేడాదిగా జిల్లాలో వర్షాభా వ పరిస్థితుల నేపథ్యంలో చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు ఎండుముఖం పట్టాయి. దీంతో ప్రతినెలా భూగర్భజలాలు తగ్గుతూనే ఉన్నాయి.
కొత్త బోర్లు తవ్విస్తున్నా..
పాతాళగంగను పైకి తీసుకొచ్చేందుకు అన్నదాత లు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్న బోర్లు ఎండిపోతుండడంతో అన్నదాతలు పంటలను కాపాడుకునేందుకు కొత్త బోర్లను తవ్విస్తున్నారు. భూగర్భజలాలు అడుగంటుతుండడంతో దాదాపుగా 800 నుంచి 1000 ఫీట్ల లోతు వరకు తవ్విస్తున్నా నీరు రాని పరిస్థితి ఉన్నది. దీంతో ఒక్కో రైతు మూడు నుంచి నాలుగు వరకు బోర్లను వే యిస్తూ ..రూ. రెండున్నర నుంచి రూ. మూడు లక్షల వరకు ఖర్చు చేస్తూ అప్పుల పాలవుతున్నడే తప్ప నీరు మాత్రం రావడం లేదు. ఇదే అదును గా భావించిన బోరు బండ్ల్ల యజమానులు రేట్లు కూడా పెంచారు. ముఖ్యం గా ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, మాడ్గుల తదితర మండలాల్లో వరి పంటలు పెద్ద ఎత్తున ఎండిపోతున్నాయి. ఈ మండలాల్లో అన్నదాతలు ఎక్కువగా కొత్తగా బోర్లను తవ్విస్తున్నారు.
రెండెకరాలకు నాలుగు బోర్లు తవ్వించా..
నాకు రెండెకరాల పొలం ఉన్నది. అందులో వరితోపాటు ఇతర తోటలను నాటేందుకు ఇప్పటికే మూడుబోర్లు వేయగా.. రూ. మూడు లక్షల వరకు ఖర్చు అయ్యింది. అయినా ఆ బోర్ల నుంచి సరిపడా నీరు రాకపోవడంతో పంట ఎండిపోతున్నది. పంటను కాపాడుకునేందుకు ఇటీవల మరో బోరును రూ. రెండు లక్షల వరకు ఖర్చు పెట్టి తవ్వించగా అందులో నుంచి కూడా నీరు అంతంత మాత్రంగానే వస్తున్నది.
రెండెకరాల్లోని పంటను కాపాడుకునేందుకు ఒక్కో రైతు నాలుగు బోర్లు వేయాల్సిన దుస్థితి వచ్చింది. ప్రతి ఏటా కొత్త బోర్లను తవ్వించడంతోపాటు పెట్టుబడుల నిమిత్తం ఖర్చు రూ. లక్షల్లో అవుతున్నది. అందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పంట బాగా పండి అప్పులు తీరుతాయంటే గంగమ్మ పాతాళానికి చేరడంతో పెట్టుబడులు రాని పరిస్థితి వచ్చింది. అప్పులు ఎలా తీరుతాయో..
-వెంకట్‌రెడ్డి, రైతు, చిత్తాపూర్, మంచాల
జిల్లాలో భూగర్భజలాల నీటిమట్టం..