రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్, చేవెళ్ల, నందిగామ మండలాల్లోని పలు గ్రామాల్లో గురువారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలను ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
పోతరాజుల విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ప్రజాప్రతినిధులు, నాయకులు ఉత్సవాల్లో పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.