మొయినాబాద్ : ఐదు రోజులుగా జరుగుతున్న ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు గురువారంతో ముగిసాయి. మండల పరిధిలోని పెద్దమంగళారం, అమ్డాపూర్, అమీర్గూడ, కాశీంబౌలి గ్రామాల్లో బోనాలు ఘనంగా నిర్వహించారు. పెద్దమంగళారంలో గండిమైసమ్మ, కట్టమైసమ్మకు భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
శివసత్తుల పూనకాలు, పోతురాజులు విన్యాసాలు, డప్పు దరువుల మధ్య బోనాల ఊరేగింపు కొనసాగింది. ఉత్సవాల్లో పెద్దమంగళారం సర్పంచ్ కోట్ల నరోత్తంరెడ్డి, ఉపసర్పంచ్ రజిత, ఎంపీటీసీలు శ్రీలత, లత, అమ్డాపూర్ సర్పంచ్ బూర్గు రవళి, ఉప సర్పంచ్ నాగార్జునచారి, ఎంపీటీసీ సామ రవీందర్రెడ్డి ఉన్నారు.