షాబాద్, జూన్ 23: షాబాద్ మండలంలోని కుమ్మరిగూడలో బొడ్రాయి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆదివారం గ్రామంలో బొడ్రాయి విగ్రహం వద్ద పూజలు చేశారు. అనంతరం మహిళలు బోనాలతో గ్రామంలో ఊరేగింపుగా వెళ్లి బోనాలు సమర్పించారు. ఈ ఉత్సవాల్లో శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ వేడుకల్లో మాజీ సర్పంచ్ పోనమోని కేతన రమేశ్‌యాదవ్, ఎంపీటీసీ దేశమళ్ల అరుణ, మాజీ ఎంపీటీసీ పోచయ్య, గ్రామ పెద్దలు రమేశ్‌యాదవ్, మంచాని నారాయణరెడ్డి, దేశమళ్ల ఆంజనేయులు, క్యామ నారాయణ, కుమార్‌యాదవ్, హనుమంతు, మల్లయ్య, శ్రీశైలం, యువకులు తదితరులున్నారు.