కొడంగల్, జూలై 5 : రేవంత్‌రెడ్డి రాజకీయానికి ముగింపు సన్నద్ధం అయినట్టుందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సెగ్మెంట్లోని బొంరాస్‌పేట, దుద్యాల, దౌల్తాబాద్ మం డలాలతోపాటు పట్టణంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ బీఎల్ఏల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. మిడ్జిల్‌లో జరిగిన సమావేశంలో రేవంత్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రకటించడాన్ని చూస్తే తన పాలిటిక్స్‌కు ముగింపు పలుకుతున్నట్టుగా ఉందన్నారు. కాంగ్రెస్ పాలన పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న విషయం రేవంత్‌కు అర్థం కావడంతోనే ఆయన అలా మాట్లాడారన్నారు. కాంగ్రెస్ పాలన 30 నెలలు దాటినా ప్రజలకు ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయడంలేదని ఎద్దేవా చేశారు.
ప్రస్తుతం ప్రభుత్వం రైతుభరోసాను విడుదల చేసిందని, దీన్ని బట్టి చూస్తే త్వరలోనే జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నట్టు సంకేతంగా ఉందన్నారు. గతం లో ఎంపీ ఎన్నికల సందర్భంగా రైతుభరోసాను విడుదల చేశారన్నారు. గత కేసీఆర్ హయాంలో నాట్ల సమయంలో రైతుబంధును అందిస్తే.. రేవంత్ ఓట్లు సమయం లో పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న సర్ ప్రక్రియలో ప్రతి ఓటును కాపాడేందుకు బీఆర్ఎస్ బీఎల్ఏలు అప్రమత్తంగా ఉం డాలన్నారు. బీఎల్ఏలు ఇంటింటికెళ్లి బీఎల్వోలు ఓటరు ఫారాలు అందించారా లేదా గుర్తించడంతోపాటు.. ఆ ఫారాలను నింపి తిరిగి బీఎల్వోలకు అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో దామోదర్‌రెడ్డి, మధుసూదన్‌రావు యాదవ్, శ్రీనివాస్, మధుసూదన్‌రెడ్డి, మండల, మున్సిపల్ పరిధిలోని బీఎల్ఏలు, బొంరాస్‌పేట, దుద్యాల, దౌల్తాబాద్ మండలాల బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.