ఆమనగల్లు, డిసెంబర్ 23 : మున్సిపాలిటీ పరిధిలోని 13 వ వార్డు కమలానగర్ కాలనీలో నివాస గృహాల మధ్య ఉన్న డంపింగ్‌యార్డు ఎత్తివేయాలని శుక్రవారం బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు నేనావత్ పత్యానాయక్ ఆధ్వర్యంలో నిరవధిక నిరహార దీక్ష చేపట్టారు . దీక్షకు ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని గ్రామాలు, తండాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే ఆమనగల్లు మున్సిపాలిటీ మాత్రం అందుకు విరుద్ధ్దంగా ఉందన్నారు. ప్రజలు అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వానికి బాసటగా నిలువాలని కోరారు. పట్టణంలో నిర్మిస్తున్న కళాశాల భవన నిర్మాణ పనులను అడుగడుగునా అడ్డుకుంటూ ప్రగతి నిరోధకంగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నివాస గృహాల మధ్య మున్సిపల్ డంపింగ్‌యార్డు ఏర్పాటుతో ప్రజలు, విద్యార్థులు అనారోగ్యం భారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కోట్ల రూపాయలను కేటాయిస్తున్న కూడా వాటిని వినియోగించడంతో స్థానిక మున్సిపాలిటీ పాలకవర్గం విఫలమైందన్నారు.
త్వరలోనే రోడ్డు విస్తరణలో దుకాణాలు కోల్పోయిన చిరు వ్యాపారుల దుకాణ సముదాయాలను నిర్మిస్తామని తెలిపారు. సమస్యను మంత్రితో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం దీక్షలో కూర్చున్న నాయకులకు ఎమ్మెల్యే నిమ్మరసం అందజేసి దీక్షను విరమింపజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు నేనావత్ అనురాధ, జర్పుల దశరథ్‌నాయక్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాస్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ తోట గిరియాదవ్, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, ప్యాక్స్ చైర్మన్ గంప వెంకటేశ్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్, ఎంపీటీసీ దోనాదుల కుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అర్జున్‌రావు, అప్పం శ్రీనివాస్, నిరంజన్, ఖలీల్, బాలస్వామి, రామకృష్ణ పాల్గొన్నారు.