శేరిలింగంపల్లి, ఏప్రిల్ 1: ప్రజా పాలన అంటే ప్రభుత్వ భూములను అమ్మడమా? హామీలు కొండంత అమలు చేయడంలో గోరంత అని బీజేపీ నాయకులు రేవంత్ సర్కారుపై మండిపడ్డారు. హెచ్సీయూ విద్యార్థులు చేస్తున్రన ఆందోళనకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యూనివర్సిటీలో పనులు వెంటనే ఆపాలని లేని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. భూముల వేలం ఎక్కడ ఆగిపోతుందేమోనన్న భయంతో ప్రతిపక్షాలను కదలనివ్వకుండా అణిచివేతకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం భూములను అమ్మి రూ.30 వేల కోట్ల రూపాయలను సేకరించాలని ప్రయత్నం చేస్తుందని, రేవంత్ రెడ్డి ఆస్తులు అమ్మడం, అప్పులు తేవడం అనే ఎజెండాతో పనిచేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నాయకులు బుచ్చిరెడ్డి, వరప్రసాద్, మారం వెంకట్, డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, జితేందర్ , సీనియర్ నాయకులు సురేష్ మల్లేష్, మహేష్, అభిషేక్, సాయి మురళిలు పాల్గొన్నారు.