వికారాబాద్, ఆగస్టు 21 : వికారాబా ద్ జిల్లాలో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల పనులకు బుధవారం రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ వేదమంత్రోచ్ఛరణల మధ్య భూమిపూజ చేశారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మేకలగండిలోని 30 ఎకరాల్లో రూ. రూ.235 కోట్లతో వివిధ భవనాలను నిర్మించనున్నారు. ముందుగా కార్యక్రమ ప్రాంగణానికి శాసనసభాపతి రాగా కలెక్టర్ ప్రతీక్‌జైన్ పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు.
శంకుస్థాపనలో ఎస్పీ నారాయణరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మంజులారమేశ్, వైస్ చైర్ పర్సన్ శం షాద్బేగం, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుధాకర్‌రెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ వసంతనాయక్, ఈఈ శ్రీధర్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ పద్మ, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రామచంద్రయ్య, ఆర్డీవో వాసుచంద్ర, తహసీల్దార్ పాల్గొన్నారు.
చెరువుల సర్వేను పూర్తిచేయాలి
రంగారెడ్డి, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని చెరువుల సర్వేను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ శశాంక రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులను ఆదేశించారు. బుధవా రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్‌తో కలిసి ఆర్డీవోలు, ఇరిగేషన్ అధికారులు, హెచ్ఎండీఏ నోడల్ అధికారులతో చెరువుల సర్వేపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 1,075 చెరువులుండగా 945 చెరువుల సర్వే పూర్తైందని.. ఇంకా 38 చెరువుల సర్వే చేయాల్సి ఉందని.. వాటిని వా రంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామనక్షలు, పహణీలతో క్షేత్ర స్థాయిలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించి ఎఫ్టీఐలు, బఫర్ల ను గుర్తిస్తూ కడీలు, సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.
క్షేత్రస్థాయిలో పరిశీలించే సమయంలో ఆయా చెరువులకు సంబంధించిన మ్యాపులను తీసుకెళ్లాలన్నారు. తొలుత క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు, ఇరిగేషన్ ఏఈలు సంయుక్తంగా తమ పరిధిలోని చెరువులను పరిశీలించి డివిజన్ స్థాయికి నివేదికలు పంపాలని, ఫైనల్ సర్వే నిర్వహించిన వెంటనే ఆయా చెరువుల నివేదికలను హెచ్ఎండీఏకు పంపించాలన్నారు. జిల్లాలోని చెరువులు ఆక్రమణలు, కబ్జాలకు గురి కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. సమావే శంలో ఆర్డీవోలు సూరజ్‌కుమార్, అనంతరెడ్డి, వెంకట్‌రెడ్డి, సాయిరాం, వేణుమాధవ్, ఇరిగేషన్ డీఈ నరేందర్‌రెడ్డి, హెచ్ఎండీఏ నోడల్ అధికారి రమాదేవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.