పరిగి, నవంబర్ 5 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తి చేయబడి అయిదారు సంవత్సరాలుగా ఉపయోగంలో ఉన్న 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మండలిలో చీఫ్ విప్ పి.మహేందర్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క బుధవారం ప్రారంభించారు.
సాధారణంగా పనులు పూర్తయిన వెంటనే ఏ అభివృద్ధి కార్యక్రమమైనా ప్రారంభించడం జరుగుతుంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన పాత సబ్‌స్టేషన్‌ను మళ్లీ ప్రారంభింపజేయడం విడ్డూరమని స్థానికులు చర్చించుకుంటున్నారు.