కేశంపేట(నవంబర్ 08) : తెలంగాణలో ప్రభుత్వ దవాఖానల్లో ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే వైఅంజయ్యయాదవ్ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్రంలో ప్రైవేటు హాస్పిటల్స్ కన్నా ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రజలకు అన్నివిధాల రోగాలకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని తెలిపారు.
అధేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలతో అన్నివర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందని, పేదల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అసరా ఫించన్లు, రైతుబంధు, రైతుభీమా, కళ్యాణలక్ష్మీ, ఇంటింటికి మంచినీరు తదితర సంక్షేమ పథకాలు ప్రజాదరణ పొందుతున్నాయన్నారు. రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ది సాధించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. కేశంపేటలోని ప్రభుత్వాసుపత్రిలో రోగుల కోసం 30 పడకలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం 75 లక్షలు నిధులు మంజూరు చేసిందన్నారు.
కార్యక్రమంలో సర్పంచ్ వెంకట్రెడ్డి, మార్కెట్ వైస్చైర్మెన్ నారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ విశ్వనాధం, టీఆర్ఎస్ నాయకులు శ్రావణ్రెడ్డి, మురళీమోహన్లతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.