వికారాబాద్ : కుల, లింగ, వర్ణ అసమానతలకు వ్యతిరేకంగా, సమానత్వ సమాజ స్థాపన కోసం బోధనలు చేసి, సామాజిక జాగృతిని ప్రేరేపించిన మహనీయుడు బసవేశ్వరుడని ( Basaveshwar) వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ( Former MLA Methuku Anand) అన్నారు.
బసవేశ్వర మహారాజ్ జయంతి సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని ఎంఆర్పీ చౌరస్తా వద్ద బసవేశ్వరుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బసవేశ్వరుని బోధనల నుంచి స్ఫూర్తి పొంది సర్వసమాన సమాజ స్థాపనకు అందరం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ , బీఆర్ఎస్ పార్టీ మండలాల నాయకులు పాల్గొన్నారు.