షాబాద్, ఆగస్టు 21: బీసీలకు స్థానిక సంస్థలలో 42శాతం రిజర్వేషన్లు కల్పించేవరకు పోరాటం చేస్తామని బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని కక్కులూర్ గ్రామంలో బీసీసేన సమావేశం నిర్వహించారు. అనంతరం నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. బీసీసేన గ్రామ కమిటీ అధ్యక్షుడిగా రాజేందర్‌గౌడ్, ఉపాధ్యాక్షుడిగా కావలి శ్రీశైలం, యువజన కమిటీ అధ్యక్షుడిగా చాకలి తిరుపతి, ఉపాధ్యాక్షుడిగా జింకల శివశంకర్, ప్రధాన కార్యదర్శిగా మంగలి నర్సింహులు, కోశాధికారిగా పట్నంశెట్టి మోహిత్, కార్యదర్శిగా చాకలి పురుషోత్తం తదితరులను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ మాట్లాడుతూ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని బీసీలంతా పార్టీలకతీతంగా ఏకతాటిపైకి వచ్చి తమ హక్కుల సాధనకోసం పోరాటం చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థలలో 42శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు.
బీసీసేన ఆధ్వర్యంలో గ్రామాల్లో యువతను చైతన్య పరుస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీసేన మండల అధ్యక్షుడు కమ్మరి దయాకర్‌చారి, ఉపాధ్యాక్షుడు మీరంపల్లి బాలరాజ్, యూత్ అధ్యక్షుడు బండ అజయ్‌కుమార్, జిల్లా ఉపాధ్యాక్షుడు మేకల వెంకటేష్, సోషల్ మీడియా అధ్యక్షుడు నర్సింహులు, మాజీ సర్పంచ్ కావలి యాదగిరిముదిరాజ్, సంఘం సభ్యులు కృష్ణ, శివకుమార్, దోస్వాడ శ్రీశైలం, అబ్బాస్, ఆనంద్, మహేందర్, వెంకటేష్, ప్రసాద్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.