షాద్‌నగర్, జూన్17 : త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పర్వదినాన్ని షాద్‌నగర్ ని యోజకవర్గంలో సోమవారం ముస్లింలు ఘ నంగా జరుపుకొన్నారు. షాద్‌నగర్ మున్సిపాలిటీ ఫరూఖ్‌నగర్ ఈద్గాతో పాటు కేశంపేట, ఫరూఖ్‌నగర్, కొందుర్గు, చౌదరిగూడ మండ ల కేంద్రాలతో పాటు గ్రామాల్లోని ఈద్గాల వద్ద ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేశారు. ఫరూఖ్‌నగర్ ఈద్గా వద్ద స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డిలు ముస్లిం మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, సోదరులకు పర్వదిన దిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, నాయకులు సుధీర్, చీపిరి రవియాదవ్, ఎండీ ఎజాజ్ అడ్డు, శ్రీనివాస్‌రెడ్డి, జమృత్‌ఖాన్, బా బర్ఖాన్, నల్లమోని శ్రీధర్, మంగ మధు, నీర టి వాసు, చెంది తిరుపతిరెడ్డి, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ఆమనగల్లు : త్యాగానికి ప్రతీక బక్రీద్ అని క ల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నా రు. బక్రీద్ వేడుకలు సోమవారం మండల పరిధిలో ముస్లింలు ఘనంగా నిర్వహించారు. ఆమనగల్లు పట్టణంలో మెకానిక్ బాబా నివాసంలో జరిగిన బక్రీద్ వేడుకల్లో ఎమ్మెల్యే పా ల్గొని ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ.. ఈ పండుగ సోదర భావం, ఐక్యతకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ముస్లింలు ఉదయం నుంచే ఆనందోత్సాహాలతో మసీదులు, ఈద్గాల వద్దకు చేరుకొని ప్రత్యేక పార్థనలు చేశారు. ఒకరినొకరు అలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు సయ్యద్ ఖలీల్, మహ్మద్ మాసూం, మెకానిక్ బాబా, ఖలీల్, అలీం, కలీమ్, అజీమ్, హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.
షాద్‌నగర్‌రూరల్ : ఫరూఖ్‌నగర్ మండల కేం ద్రంతో పాటు గ్రామాల్లో ముస్లింలు సోమవా రం బక్రీద్ వేడుకలను ఘనంగా జరుపుకున్నా రు. ఆయా గ్రామాల్లోని మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఇబ్రహీంపట్నం: త్యాగానికి ప్రతీకగా జరుపుకొ నే బక్రీద్ పండుగను ఇబ్రహీంపట్నం నియోకవర్గ పరిధిలో సోమవారం ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉదయమే ఈద్గాలు, మసీదుల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇబ్రహీంపట్నం, మంచా ల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్, ఆదిబట్ల, పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీల్లో పండుగను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులు ఈద్గాలు, మసీదుల వద్దకు వెళ్లి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
మంచాల : భక్తి విశ్వాసాలు, త్యాగానికి ప్రతీకగా జరుపుకొనే బక్రీద్ పండుగను మంచాల మండల పరిధిలోని గ్రామాల్లో ముస్లింలు ఘ నంగా జరుపుకొన్నారు. ఉదయమే ఈద్గాల వద్ద ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు అలింగనం చేసుకొని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : పట్టణలో బక్రీద్ పండుగను ము స్లింలు ఘనంగా జరుకొకున్నారు. మండల కేంద్రంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ప్రార్థనలకు వ చ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మసీదు కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశా రు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చేవెళ్ల సీఐ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు, ముస్లింలు తదితరులు పాల్గొన్నారు.
మొయినాబాద్ : మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో ముస్లింలు భక్తి శ్రద్ధలతో బక్రీద్ వేడులకను ఘనంగా జరుకొన్నారు. ఉదయమే ఈద్గాల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు పండుగ శు భాకాంక్షలు చెప్పుకొన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ముస్లింలను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
కడ్తాల్ : మండల పరిధిలో ముస్లింలు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకొన్నారు. కడ్తాల్‌లోని ఈద్గా వద్ద ఇమామ్ జహీరుద్ధీన్ ఆధ్వర్యంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఈద్గా వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్‌నాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్, ఎస్సై వరప్రసాద్, కోఆప్షన్ సభ్యుడు జహంగీర్‌బాబా, పీఏసీఎస్ డైరెక్టర్ వెంకటేశ్, యువజన సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ రాఘవేందర్, మసీదు కమిటీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, మహ్మద్ జావిద్, మైనార్టీ నాయకులు లాయక్‌అలీ, వాహబ్, జహంగీర్‌అలీ, అసిఫ్అలీ, ఇర్షాద్, గౌస్, హి మాయత్అలీ, మహబూబ్అలీ, యూనస్, యూసఫ్, మోహిన్, అనిస్, నదీమ్, మేరాజ్, ఇద్రీస్, సల్మాన్, అమేర్, అతీక్, ఇర్షాద్, వా హబ్, నిజాం, లతీఫ్, సలీం, ఆజ్గర్అలీ, అహ్మ ద్, సాజీద్, జానీ, రఫీక్, బారీ, ఖాలేద్, మ న్సూర్ తదితరులు పాల్గొన్నారు.
యాచారం : బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం లు పెద్ద ఎత్తున గొర్రెలు, మేకలను కొనుగోలు చేసి, మాంసాన్ని చుట్టు పక్కల వారికి, బంధువులకు పంచిపెట్టారు. విందు వినోదాలతో సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ ఎస్సై ప్రసాద్, ఏవీజీ ఫౌండేషన్ చైర్మన్ ఆడాల గణేశ్, మైనార్టీ నాయకుడు మహ్మద్ గౌస్ బక్రీద్ వేడుకల్లో పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.
షాబాద్ : మండల పరిధిలో బక్రీద్ పండుగ ను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకొన్నారు. సోమవారం మండలంలోని పోతుగల్, షాబాద్, హైతాబాద్, బోడంపహాడ్, సోలీపేట్, మన్మర్రి, అంతారం, బొబ్బిలిగామ తదితర గ్రామాల్లోని ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగంనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.