త్యాగానికి ప్రతీక బక్రీద్, దేవుడి కోసం ప్రాణాలు ఇవ్వడానికి వెనుకాడని భక్తిభావం.. సోమవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ (ఈద్-ఉల్-జుహా) పండుగను ఘనంగా జరుపుకొన్నారు. వేకువ జామునే నిద్ర లేచి కొత్త దుస్తులు ధరించి డప్పువాయిద్యాలతో ఊరేగింపుగా ఈద్గా,
మసీద్ల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దలు ఖురాన్ బోధనలు, బక్రీద్ ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలుపుకొన్నారు. నిరుపేదలకు ఆహార పదార్థాలను పంపిణీ చేశారు.
– న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ